Thursday, January 23, 2025

గంజాయి, వీడ్ రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

3లీటర్ల వీడ్ ఆయిల్, 28 కిలోల గంజాయి స్వాధీనం
రూ.10లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి, వీడ్ ఆయిల్ హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువైన మూడు లీటర్ల వీడ్ ఆయిల్, 28కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర సోమవారం వివరాలు వెల్లడించారు. ఎపికి చెందిన గోలి కుమారస్వామి, జోన్న స్వామి ఇద్దరు కలిసి చదువు కున్నారు. ఎపిలోని లంబసింగికి చెందిన లక్ష్మణ రావు గంజాయి విక్రేత. ఆర్థిక పరిస్థితుల వల్ల కుమారస్వామి, జోన్న స్వామి చదువును మధ్యలోనే ఆపివేశారు. తర్వాత ఇద్దరు కలిసి కూలీ పనులు చేస్తున్నారు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన స్నేహితులను లక్ష్మణ రావు కలిశాడు. తన వద్ద నుంచి గంజాయి తీసుకుని వెళ్లి చెప్పిన వారికి అప్పగిస్తే భారీగా డబ్బులు ఇస్తామని చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి గత ఏడాది జూన్,2022లో 180 కిలోల గంజాయిని తీసుకుని తమిళనాడు రాష్ట్రాకికి బయలుదేరాడు. ఈ విషయం ఎపి పోలీసులకు తెలియడంతో పత్తిపాడు వద్ద ఇద్దరిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

గత నెల 23వ తేదీన జైలు నుంచి విడుదలైన నిందితులు ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ గంజాయి రవాణా చేసేందుకు ముందుకు వచ్చారు. లక్ష్మణరావు ఇచ్చిన గంజాయి, వీడ్ ఆయిల్‌ను తీసుకుని ఆర్టిసి బస్సులో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చిన నిందితులు వాటిని లక్ష్మణరావు చెప్పిన వారికి ఇచ్చేందుకు ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉండా పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్ మధు, ఎస్సై రవి, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News