Sunday, November 17, 2024

పొగాకు వస్తువులు రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Two arrested for transporting tobacco products
రూ.20లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 24 బ్యాగుల్లోని పొగాకు వస్తువులు, ఇన్పోవా కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.20లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…. భద్రాద్రికొత్తగూడెం జిల్లా, చంద్రగుంట మండలం, గ్రామానికి చెందిన బడుగు నరేష్ వ్యాపారం చేస్తున్నాడు.

రాజస్థాన్ రాష్ట్రం, గలోర్ జిల్లా, కలేటి గ్రామానికి చెందిన రమేష్ ఖాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా, చంద్రుగుంట గ్రామం, మండలానికి చెందిన శంకర్ వ్యాపారం చేస్తున్నాడు. శంకర్ కుటుంబంతోపాటు ఉంటూ మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. వస్తున్న డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదు. దీంతో నిషేధిత గుట్కా, పొగాకు వస్తువులు కిరాణా షాపులకు సరఫరా చేసి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. వాహనం నడిపేందుకు డ్రైవర్‌గా నరేష్‌ను నియమించుకున్నాడు. తెలంగాణలోని వివిధ జిల్లాలోని కిరాణాషాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్‌ఓటి ఎల్‌బి నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్సైలు రాజు, ఎండి తకియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News