శంషాబాద్ : వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో హోంగార్డును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన బైక్ రైడర్‌ను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల ప్రకారం.. ఈ నెల 1 వ తేదీన శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో షాద్‌నగర్ వైపు నుంచి వేగంగా వచ్చి ఓ మోటర్ సైకిలిస్ట్ హోంగార్డు వెంకటరమణను బలంగా ఢీకొట్టడంతో వెంకటరమణకు తీవ్ర గాయలయ్యాయి. వెంకటరమణను ఢీకొట్టిన బైక్ ఆగకుండా వెళ్లిపోవడంతో కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామానికి చెందిన హరినాథ్, తిమ్మాపూర్‌కు చెందిన సాయి చరణ్‌లు స్నేహితులు. ఈ నెల 1 వ తేదీన సాయంత్రం హరినాధ్‌కు చెందిన ఎఫ్‌జడ్ వాహనంపై సాయిచరణ్, హరినాధ్‌లు షాద్‌నగర్ వైపు నుంచి శంషాబాద్ వస్తున్నారు. అయితే తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చూసి గాబరా పడ్డారు. బైక్‌ను నడుపుతున్న సాయిచరణ్‌కు హెల్మెట్ లేకపోవడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. దీంతో ఎలాగైనా సరే పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో బైక్‌ను వేగంగా పోనిచ్చాడు. అయితే ఆ బైక్‌ను ఆపేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న హోంగార్డు రావడంతో హోంగార్డు వెంకటరమణను ఢీకొట్టి సాయిచరణ్, హరినాధ్‌లు బైక్‌ను ఆపకుండా పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు శంషాబాద్ రూరల్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. విచారణ చేస్తున్న కారణంగా వివరాలను వెల్లడించలేమని పోలీసులు పేర్కొంటున్నారు.
#Hyderabad: A two wheeler dashed into a traffic cop who was on his regular violation check. Police Constable Venkat Ramana sustained leg injury and has been hospitalized. The incident occurred, Thondupally toll plaza under Shamshabad. @ActivistTeja @CYBTRAFFIC pic.twitter.com/zsua9QPLaR
— NewsMeter (@NewsMeter_In) February 1, 2021