Sunday, January 12, 2025

నకిలీ వీసా ఛీటింగ్ కేసులో ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

విదేశాలకు పంపిస్తామని 25మందిని మోసం చేసిన నిందితులు
రూ.83లక్షలు వసూలు జల్సాలు చేసిన నిందితుడు

మన తెలంగాణ సిటిబ్యూరో: విదేశాలకు పంపిస్తామని డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసిన ఇద్దరు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కారు, ల్యాప్‌టాప్‌లు, వీసా అప్రూవల్ పేపర్లు, స్టాంపులు, అగ్రిమెంట్ పేపర్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, ఆసిఫ్‌నగర్, అయోధ్య నగర్‌కు చెందిన యేరువుల అభిషేక్ రెడ్డి పౌల్డ్రీ వ్యాపారం చేస్తున్నాడు. కరీంనగర్, గుంటూరుపల్లికి చెందిన తుమ్మ చిన్నమ్మ నగరంలోని నిజాంపేటలో ఉంటోంది. అభిషేక్ రెడ్డి గతంలో 2020లో సింగపూర్‌కు జాబ్ వీసాపై వెళ్లాడు.

అక్కడ కొందరితో ఏర్పడిన పరిచయాలతో తిరిగి నగరానికి వచ్చి జేఎంఏ రెడ్డి కన్సల్‌టెన్సీని ఏర్పాటు చేశాడు. అందులోని తుమ్మ చిన్నమ్మ పనిచేస్తోంది. ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లాలను కునేవారికి మాయమాటలు చెబుతున్నారు, తాము త్వరగా వీసా ఇప్పిస్తామని, ఎలాంటి అనుభవం అవసరం లేదని, ఉద్యోగం గ్యారంటీగా ఇప్పిస్తామని తమ కింద పనిచేసే ఉద్యోగులతో చెప్పించడంతో 25మంది బాధితులు వీరికి రూ.83లక్షలు చెల్లించారు.

వాటిని తీసుకున్న నిందితులు బాధితులకు నకిలీ వీసాలు ఇచ్చి పంపించారు. వాటిని తీసుకుని వెళ్లిన బాధితులకు నకిలీవని తెలియడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్ రెడ్డి తన కార్యాలయాన్ని మూసివేసి అల్వాల్‌లో ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా ఇలాగే అమాయకులను మోసం చేయడంతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సైలు శ్రీనివాసులుదాసు, రాఘవేందర్‌రెడ్డి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News