Wednesday, January 22, 2025

మైనర్‌పై గ్యాంగ్‌రేప్ కేసులో ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

Two arrested in gangrape case against minor

 మరో ముగ్గురిని
గుర్తించాం సిసిటివి
ఫుటేజీల
దర్యాప్తు కేసుతో
హోం మంత్రి
మనువడికి సంబంధం
లేదు : వెస్ట్‌జోన్
డిసిపి జోయల్ డేవిస్
నిందితులు ఎంతటివారైనా
శిక్షించండి : కెటిఆర్

మనతెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్‌రేప్ కేసులో సాదుద్దీన్ మా లిక్‌తో పాటు మరో మైనర్‌ను అరెస్ట్ చేసినట్లు వెస్డ్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు. సంచలనం సృష్టించిన బాలిక సా మూహిక అత్యాచార ఘటన వివరాలను డిసిపి జ్రుకవారం మీడి యా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డిసిపి మా ట్లాడుతూ మైనర్ జరిగిన సామూహిక అత్యాచారం కేసులో హోంమంత్రి మనువడు పుర్కాన్ అహ్మద్‌కు ఏలాంటి సంబంధం లేదని వివరించారు.

ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు విచారణలో తేలిందని, ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన మరో ముగ్గురు నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని డిసిపి తెలిపారు. కాగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్‌లు ఉన్నారని వివరించారు. ఈ కేసులోని నిందితులపై 354, 323 ఐపిసి, 9,10 పొక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, మిగిలిన నిందితుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని డిసిపి తెలిపారు. ఈ కేసులో రాజకీయ ప్రతినిధి కుమారుడు ఉన్నాడని, అతను మైనర్ కావడంతో అతని పేరు వెల్లడించలేదన్నారు. అదేవిధంగా ఈ ఘటనలో బాధితురాలు సైతం మైనర్ కావడంతో ఆమె వివరాలను ప్రసారం చేసినా, ప్రచురించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డిసిపి హెచ్చరించారు.

ఇది జరిగింది 

బంజారాహిల్స్ రోడ్డు నంబర్14లో నివసించే బాలిక(17) గత నెల 28వ తేదీన తన స్నేహితుడు హాదీ, సూరజ్‌లతో కలిసి పార్టీ చేసుకునేందుకు బెంజ్ కారులో టిఎస్09ఎఫ్‌ఎల్ 6460లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పార్టీ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు పబ్ నుంచి బాలిక బయటికి రాగా నలుగురు నిందితులు బాలికను బలవంతంగా ఇన్నోవా కారులో ఎక్కించుకుని బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 14లో ఉన్న బేకరీ వద్దకు తీసుకెళ్లి ఫుడ్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బాలికను నిందితులు ఒకరి తరువాత మరొకరు ఇన్నోవా కారులోని సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈక్రమంలో రాత్రి 7.30 గంటల సమయంలో పబ్బు వద్ద వదిలేసి వెళ్లడంతో సదరు మైనర్ బాలిక తన తండ్రికి ఫోన్ చేయడంతో అతను వచ్చి కారులో ఇంటికి తీసుకెళ్లాడు. అయితే బాలిక మెడపై గాయాలు ఉండడంతో గమనించిన తండ్రి ప్రశ్నించడంతో గ్యాంగ్ రేప్ విషయం బయటికి వచ్చింది. వెంటనే బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టిన నిందితులను గుర్తించారు.

కీలకంగా మారిన సిసిటివి ఫుటేజ్…

అత్యాచార ఘటనపై బాధితురాలి తండ్రి ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డిసిపి తెలిపారు. పబ్, బేకరీ వద్ద ఉన్న కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారని, బాలిక పబ్ నుంచి బయటికి రాగానే ఆమెను నలుగురు యువకులు ఇన్నోవా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం, తర్వాత ఇన్నోవా కారులో బాలికను తీసుకుని వచ్చి పబ్ వద్ద దింపిన సిసి ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారన్నారు.

నాపై అత్యాచారం జరిగిందిః బాధితురాలు

తనపై సామూహిక అత్యాచారం జరిగిందని భరోసా సెంటర్‌లో బాధితురాలు తెలిపింది. కాలేజ్ ఫ్రెండ్స్ ఈనెల 28న పబ్‌లో పార్టీ చేసుకున్నామని, అదే రోజు సాయంత్రం 5గంటలకు గుర్తుతెలియని యువకులు వచ్చి తనను బలవంతంగా కారులో తీసుకు వెళ్లారని, ఈక్రమంలో అదే రోజు రాత్రి 7గంటలకు జూబ్లీహిల్స్‌లో పబ్బు దగ్గర వదిలిపెట్టారని వివరించింది, కారులో తనపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన మెడ దగ్గర తీవ్ర గాయాలు అయ్యాయని, ఈ విషయం తన తండ్రికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడని వివరించింది.

నిందితులు ఎంతటి వారైన శిక్షించండిః మంత్రి కెటిఆర్

జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో నిందితులు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని మంత్రి కెటిఆర్ ట్విటర్ పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌లను కోరారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న వారు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

కాలేజీ లెటర్‌తోనే పార్టీ ఏర్పాటు ః

బాధితురాలు చదివే కాలేజీ రిక్వెస్ట్ లెటర్ వల్లే గత నెల 28న తమ పబ్‌లో పార్టీ ఏర్పాటు చేసినట్లు అమ్నేషియా పబ్ మేనేజర్ మీడియాకు తెలిపాడు. పార్టీలో దాదాపు 150 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని, అయితే విద్యార్థులు ఎవరూ మద్యం సేవించలేదని వివరించారు. పబ్‌లో ఉన్న సిసిటివి ఫుటేజీని పోలీసులకు ఇచ్చామని, ఈ కేసులో విచారణకు అన్ని విధాల సహకరిస్తామని పబ్ మేనేజర్ తెలిపారు.

జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్తత 

బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు నిర్లక్షంగా దర్యాప్తు చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం నాడు బిజెపి నాయకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన ఎదుట ఆందోళనతో పాటు ధర్నా చేపట్టారు. ఈక్రమంలో పోలీస్‌స్టేషన్‌లోకి బిజేపి కార్యకర్తలు దూసుకెళ్లేందుకు యత్నించడంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల పిల్లలను కేసు నుంచి పోలీసులు తప్పించారని బిజెపి నాయకులు ఆరోపించారు. ధర్నా చేస్తున్న బిజేపి నాయకులు మాజీ ఎంఎల్‌ఎ చింతల రామచంద్రారెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News