Friday, January 24, 2025

జార్ఖండ్ నోట్ల గుట్ట కేసులో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మంత్రి పిఎస్ నౌకరు ఫ్లాట్‌లో రూ. 34.23 కోట్లు స్వాధీనం

రాంచి: జార్ఖండ్ మంత్రి ఆలంగిర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్‌ను, ఆయన నౌకరు జహంగిర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) మంగళవారం అరెస్టు చేసింది. జహంగీర్ ఇంటిలోని గదిలో సోమవారం రూ.34.23 కోట్ల లెక్కల్లో చూపని నగదును ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి వారిద్దరినీ ప్రశ్నించిన ఇడి అధికారులు పిఎంఎల్‌ఎ నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు. కాగా..ఈ డబ్బుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని 70 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలం స్పష్టం చేశారు.

2023 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన జార్ఖండ్ గ్రామీణ పనుల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సంజీవ్ లాల్ నౌకరు ఉంటున్న ఫ్లాట్‌తోసహా రాంచిలోని అనేక నివాసాలపై ఇడి అధికారులు సోమవారం దాడులు జరిపారు. గ్రామీణ పనుల శాఖలో కొన్ని పథకాల అమలులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇడి కేసు నమోదు చేసింది. సంజీవ్ లాల్ నౌకరు జహంగీర్ ఉంటున్న ఫ్లాట్ నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారు నగలతోపాటు ఒక లగ్జరీ ఎస్‌యువిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా..జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న మున్నా సింగ్ అనే బిల్డర్ ఇంటి నుంచి మరో రూ. 3 కోట్లను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్‌పై ఇడి గతంలో కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News