Saturday, December 21, 2024

యువమోర్చ సభ్యుడి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested in Karnataka BJP worker murder case

మంగళూరు: బిజెపి యువ మోర్చ నాయకుడు ప్రవేణ్ నెట్టారు హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను షఫీఖ్ బల్లెరె, జఖీర్ సవనురుగా గుర్తించారు. అంతకుముందు, ఈ కేసులో 21 మంది నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పిఎఫ్‌ఐ, ఎస్‌డిపిఐ సభ్యులని పోలీసులు తెలిపారు. మతపరంగా సున్నితమైన దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన బెల్లారె పట్టణంలోని నెట్టారు నివాసి అయిన ప్రవీణ్ నెట్టారు మంగళవారం రాత్రి హత్యకు గురయ్యారు. తన బ్రాయిలర్ షాప్ మూసి ఇంటికి తిరిగి వెళుతున్న ప్రవీణ్‌ను బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు నరికి చంపారు. ఈ సంఘటన దరిమిలా దక్షిణ కన్నడ జిల్లాలోని అనేక ప్రాంతాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News