Saturday, December 21, 2024

ప్రజ్వల్ వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ల వ్యవహారంలో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్‌లో ఆదివారం అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరినీ హసన్ సిటీ లోని ఎన్‌ఆర్ సర్కిల్ వద్ద ఉన్న సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణ చేసి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. నిందితుడు చేతన్‌ను యెలగుండ గ్రామంలో అతని నివాసంలో కూడా సిట్ బృందం గంటన్నర సేపు ప్రశ్నించింది. మరో నిందితుడు లిఖిత్‌ను శ్రావణబెలగోలలోని అతని ఇంట్లో విచారణ జరిపింది.

ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల పెన్‌డ్రైవ్ ఏప్రిల్ 21న సర్కులేషన్ కాగా, రేవణ్ణ మాజీ కారు డ్రైవర్ కార్తీక్, పుట్టరాజు, నవీన్‌గౌడ, చేతన్, లిఖిత్‌లపై జేడీఎస్ పోల్ ఏజెంట్ పూర్ణచంద్ర తేజస్వి సైబర్ క్రైమ్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. మరోవైపు లైంగిక వేధింపులు, కుల వేధింపుల ఆరోపణలపై పోలీస్‌లు అరెస్ట్ చేసిన న్యాయవాది, బీజేపీ నేత జి. దేవరాజ్‌గౌడను జిల్లా జైలుకు తరలించారు. ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల ఫిర్యాదుపై దేవరాజ గౌడను పోలీస్‌లు అరెస్ట్ చేయగా, మే 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News