Wednesday, January 22, 2025

సిద్దిపేట కాల్పుల ఘటనలో నిందితులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested in Siddipet robbery case

సిద్దిపేట: సిద్దిపేట కాల్పులు, చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని సిపి తెలిపారు. జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కారు డ్రైవర్ పై కాల్పులు జరిపిన దుండగులు రూ.42లక్షల  నగదు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.34 లక్షలు నగదుచ 2 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సిద్దిపేట సిపి శ్వేత వెల్లడించారు. కాల్పులు, చోరీ ఘటనలో ఎత్తుకెళ్లిన బైకును వాడినట్టు సిపి పేర్కొన్నారు. కొండపాక మండలం సిర్సనగండ్ల వద్ద బైకును చోరీ చేసినట్టు తెలిపారు. 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన నిందితులను పట్టుకున్నామని ఆమె మీడియా సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం సాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సిద్దిపేట సిపి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News