Tuesday, December 24, 2024

బిగ్‌బాస్ కేసులో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  బిగ్ బాస్‌లో పాల్గొన్న ఇద్దరి కంటెస్టెంట్ల అభిమానుల మధ్య గొడవ జరగడంతో కార్లు, ఆర్‌టిసి బస్సులపై దాడి చేశారు. ఈ దాడిలో కార్లు, ఆరు ఆర్టిసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. ఆర్‌టిసి అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి అభిమానులపై కేసు నమోదు చేశారు.

ఇందులో నిందితులుగాఉన్న సాయికుమార్, రాజు అనే ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించేందుకు పోలీసులు వీడియోలను జల్లెడపడుతున్నారు. అందులో నిందితులను గుర్తించి మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News