Friday, December 20, 2024

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూర్‌ః ఇంట్లో చోరీ చేసి డబ్బులు,మొబైల్‌ను ఎత్తుకుని వెళ్లిన ఇద్దరు యువకుడలను కంచన్‌బాగ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 26 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హఫీజ్‌బాబానగర్‌ కు చెందిన సయిద్ ఇర్ఫాన్ అలియాస్ సిద్ధిఖ్ అలియాస్ రాజ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు,రాహెల్ ఖాన్ కలిసి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నాడు.

హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ ఎండి ఖాజా పాషా ఇంటోని నిద్రించి తెల్లవారుజామున లేచి చూసేసరికి తన పక్కన ఉండాల్సిన ఫోన్ కన్పించలేదు. వెంటనే ఇంట్లో చూసేసరికి అల్మారా తెరిచి ఉంది. దానిలో చూడగా అందులో ఉండాల్సిన రూ.12,000 చోరీకి గురయినట్లు గుర్తించాడు. వెంటనే కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News