- Advertisement -
హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సిట్ అధికారులు భగవంత్ రవి కుమార్‌ను అరెస్టు చేశారు. డాక్యా నాయక్ నుంచి భగవంత్ అనే వ్యక్తి ఎఇ పేపర్ కొనుగోలు చేశారు. తన తమ్ముడు రవి కుమార్ కోసం ఎఇ పేపర్ ను భగవంత్ కొన్నాడు. వికారాబాద్ ఎంపిడిఒ కార్యాలంలో భగవంత్ పని చేస్తున్నారు. డాక్యా నాయక్ ఖాతాలో లావాదేవీల విచారణలో ఈ విషయం బయటపడింది. డాక్యా నాయక్ వద్ద రెండు లక్షల రూపాయలకు ఎఇ పేపర్‌ను భగవంత్ కొన్నాడు. టిఎస్‌పిఎస్‌సి లీకుల కేసులో అరెస్టుల సంఖ్య 22కు చేరింది.
Also Read: కర్ణాటకలో మతతత్వ పూనకం!
- Advertisement -