Monday, December 23, 2024

గాల్లోనే రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఇద్దరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సస్పెండ్

కాఠ్మండ్ : ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన విమానాలకు పెను ప్రమాదం తప్పింది. గాల్లోనే దాదాపు ఢీకొన్నంత పనిచేశాయి. వెంటనే హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరించినందుకు గాను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై నేపాల్ పౌర విమానయాన సంస్థ వేటు వేసింది.

నేపాల్ పౌర విమానయాన సంస్థ వివరాల ప్రకారం నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శుక్రవారం ఉదయం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి కాఠ్‌మండ్ కు బయల్దేరింది. ఇటు ఢిల్లీ నుంచి కాఠ్‌మండ్‌కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకుంది. మార్గమధ్యలో నేపాల్ లోకి ప్రవేశించాక అవి అత్యంత సమీపానికి వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకి దిగుతుండగా, ఆ సమయంలో నేపా ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.

రెండు విమానాలు అత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News