- Advertisement -
వేల్పూర్: వేల్పూర్ మండలం పడగల్ గ్రామం శివారులో మేడో ఒర్రె క్రాసింగ్ వద్ద ఆటో డ్రైవర్ల నిర్లక్షంతో రెండు ఆటోలు ఢీకొనడం జరిగింది. రెండు ఆటోలు, ఢీకొనడం వల్ల రెండు ఆటోల ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మేడో ఒర్రె కల్వర్టు బ్రిడ్జి మూల మలుపు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న ఆటోలు కనబడక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. ఈ రెండు ఆటోలలో ప్రయాణించే ఇరువురికి గాయాలవడం వల్ల ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -