- Advertisement -
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ఫలక్‌నుమాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇంక్యుబేటర్ లో పెట్టి వదిలేయడంతో వేడికి ఇద్దరు శిశువులు మృతిచెందారు. ఇద్దరు శిశువుల ఛాతీ భాగంలో కాలిన గాయాలు ఉన్నాయి. ఉదయం ప్రసవం కాగానే వైద్యులు వేడి కోసం ఇంక్యుబేటర్ లో పెట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతిచెందారంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -