Monday, December 23, 2024

యూట్యూబ్​లో చూసి బైక్ చోరీలు.. ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two bike thieves arrested in Hyderabad

మియాపూర్: పెరుగుతున్న టెక్నాలాజీ మంచితో పాటు చెడుపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. యూట్యూబ్ లో చూసి దొంగతనాలను నేర్చుకొని పార్కింగ్ చేసిన బైకులను దొంగతనాలకు పాల్పడుతూ ఇద్దరు నిందితులు కటకటలపాలయ్యారు. ఈ సంఘటన మియాపూర్ లో జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాదాపూర్ డీసిపి శిల్పవల్లి కేసుకు సంబంధించిన వివరాలను వెళ్లాడించారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన రాజు రెహమాన్ (22), ఇమోన్ హక్యూ మొండల్ (25) ఇద్దరు చందానగర్ లోని నాగార్జున గ్రామర్ స్కూల్ వద్ద నివాసముంటూ స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. దాంతో వచ్చే డబ్బులు సరిపోక విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్న ఇద్దరు బైక్ దొంగతనాలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి, నేర్చుకొని దొంగతనాలు చేయాలనుకున్నారు.

అదే అదునుగా పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను హ్యండీల్ లాక్ విరగ్గోట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితుల పై మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, కేపిహెచ్‌బి, రాయదుర్గం, బాచుపల్లి, ఆర్‌సి పురం, సంగారెడ్డి రూరల్, సంగారెడ్డి టౌన్, పటాన్ చెరు, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు ఉన్నాయని, బైకుల బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ధ నుండి 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బైకు చోరీ కేసును చేధించిన మియాపూర్ సీఐ తిరుపతి రావు, డీఐ కాంత రెడ్డి, సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News