Monday, December 23, 2024

ఫేమస్ అవుదామని బైక్ స్టంట్.. గాల్లో కలిసిన స్నేహితుల ప్రాణాలు

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ఫేమస్ అవుదామని బైక్ స్టంట్ చేసి ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద సంఘటన చెన్నైలోని పెరియార్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడు భయనక విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం, కరుణానిధి నివాసితులు ప్రవీణ్ (19), ఆరి (17) స్థానికంగా బైక్ రైడ్ కోసం వెళ్లారు. ప్రవీణ్ యూట్యూబ్ లో బైక్ అడ్వెంచర్ చేస్తున్నాడు. స్నేహితుడు ఆరితో కలిసి బైకుపై 114 స్వీడ్ తో వెళ్లాడు. అంతే.. అదుపుతప్పిన బైక్ ను వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

హెల్మెట్ లో పెట్టిన కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. మృతుడు బైక్‌ విన్యాసాలు చేసేందుకు, వాటిని సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు బైక్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. వీడియోలో, హెల్మెట్‌కు కెమెరాను బిగించి బైక్‌ను నడిపారు, ఊహించని విధంగా బైక్ వ్యాన్ ని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News