Monday, December 23, 2024

తెలంగాణ బిజెపి ఎంపీలు ఇద్దరి వద్ద నకిలీ సర్టిఫికేట్లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపీల వద్ద నకిలీ విద్యా సర్టిఫికేట్లు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామా రావు మంగళవారం అన్నారు. అవి రాజస్థాన్, తమిళనాడుకు చెందినవని కూడా ఆయన తెలిపారు. ‘చూస్తుంటే బిజెపిలో అనేక మంది మున్నాభాయ్ ఎంబిబిఎస్‌లు ఉన్నారనిపిస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

‘ఎలక్షన్ అఫిడవిట్‌లో ఇలా తప్పుడు విద్యార్హతలను పేర్కొనడం నేరం కాదా? దాని ఆధారంగానే వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ వారి డిగ్రీలు అసలా, నకిలీయా అని నిర్ధారించనవసరంలేదా? ఒకవేళ వారి బండారం బయటపడితే వారిని అనర్హులను చేయరా?’ అని కెటిఆర్ ప్రశ్నించారు. గత వారం కూడా కెటిఆర్, ప్రధాని తన డిగ్రీలను చూయించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News