Wednesday, January 22, 2025

సముద్రంలో చిక్కుకున్న రెండు పడవలు

- Advertisement -
- Advertisement -

ప్రకాశం జిల్లా :సముద్రంలో వేటకు వెల్లి మాండూస్ తుఫాన్ కారణంగా రెండు పడవలు చిక్కుకున్నాయి.రెండు బోట్లలో చిక్కుకున్న 15మంది మత్య్సకారులు చీరాల ఓడరేవు ప్రాంతానికి చెందినవారు.సింగరాయ కొండమండలం ఊల్లపాలెం పల్లెపాలెం సమీపంలో ఒకటి, చిన్నగంజాం వద్ద సముద్ర తీర ప్రాంతంలో చిక్కుకున్న మరో బోటు.ఊల్లపాలెం సముద్ర తీర ప్రాంతంలోని బోటులో చిక్కుకున్న 8మంది మత్య్సకారులు, చిన్నగంజాం సముద్రతీర ప్రాంతంలో చిక్కుకున్న 7మంది మత్య్సకారులు.చిన్నగంజాం వద్ద చిక్కుకున్న బోటు డీజిల్ అయిపోవడంతో విషయాన్ని అధికారులు, చీరాల ఓడరేవు మత్యకారులకు ఫోన్ ద్వారా భాదిత మత్య్సకారులు సమాచారం అందించారు.

వెంటనే అప్రమత్తమై మత్య్సకారులు మరో బోటును చీరాల ఓడరేవు ప్రాంతం నుండి చినగంజాం సముద్రంలోకి పంపినారు. సముద్రంలో చిక్కుకున్న మత్య్సకారులను తమ బోటులో సురక్షితంగా బయటకు తీసుకొచ్చి తమ వాడరేవు గ్రామానికి చేరుకున్న 7 మత్య్సకారులు మెరుగు ప్రసాదు, దాసరి కుప్పేజీ, కుక్కల మహేష్, గరికిన కృష్ణ, మెరుగు శివ, వంగిర మళ్లీ, మడత పౌల్.ఇంజన్ చెడిపోయి సింగరాయ కొండ మండలం కరెడ్ సమీపంలోని సముద్ర తీరంలో చిక్కుకున్న చీరాల ఓడరేవుకు చెందిన మరో 8మంది మత్య్సకారులు.

కరేడు సమీపంలో సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఊల్లపాలెం మత్యసకారులకు చెందిన మరో బోటును మెరైన్ పోలీసులు పంపారు.కరేడ్ వద్ద లంగర్ వేసుకొని ఉన్న ప్రాంతానికి చేరుకోని సముద్రంలో చిక్కుకున్న 8మంది మత్య్సకారులను తమ వెంట వెల్లిన మరో బోటులో ఎక్కించుకోని కొత్తపట్నం మండలం గుండమాల్ల సముద్ర తీర ప్రాంతానికి చేరుకునేందుకు బయలు దేరిన బోటు.మరో గంటలో గుండమాల్లకు చేరుకోనున్న 8మంది మత్య్సకారులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News