Sunday, December 22, 2024

నీటి గుంతలో పడి ఇద్దరు బాలురులు మృతి

- Advertisement -
- Advertisement -

బాల్కొండ : బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్ గ్రామంలో పండుగ రోజున నీటి గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మధ్యాహ్నం ఇంటి నుండి ఆడుకోవడానికి వెళ్లి గ్రామ అభివృద్ధి కమిటీ భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి నిశాంత్ చరణ్ 5 సంవత్సరాలు, మెట్టు నాస్తిక్ 6 సంవత్సరాలు ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. నిశాంత్ చరణ్ తండ్రి శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో 15 రోజుల క్రితమే చిట్టాపూర్ గ్రామం నుంచి ఇత్వార్‌పేట్ గ్రామానికి వచ్చారని, ఈరోజు నిశాంత్ చరణ్ పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రుల రోధనలతో గ్రామంలో అంతా విషాధఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాల్కొండ ఎస్సై కె. గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News