Thursday, January 23, 2025

ఏమైందో ఏమో కానీ….. ఇద్దరు అన్నదమ్ములు మృతి

- Advertisement -
- Advertisement -

Khammam news

ఖమ్మం: రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… పాపటపల్లి గ్రామంలో లీలాప్రసాద్-మాధవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కార్తీక్(8), ఆదిరామ్ (6) కమారులు ఉన్నారు. గత వారం నుంచి చిన్నారులకు జ్వరం రావడంతో ఇంటి వద్దనే వైద్యం చేయిస్తున్నారు. పెద్ద కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్దనే మృతి చెందాడు. వడదెబ్బ తగిలిందని గ్రామస్థులు, బంధువులు అనుకున్నారు. రెండు కుమారుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించారు. రెయిన్ బోలో చికిత్స పొందుతు రెండో కుమారుడు ఆదిరామ్ కుడా కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదిరామ్ శరీర భాగాలను పరీక్షల నిమిత్తం కేరళకు పంపించామని వైద్యులు తెలిపారు. వాళ్ల శరీరంలో విషపదార్థాలు ఉండి ఉంటాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News