Wednesday, January 22, 2025

అస్థికలు గంగలో కలపడానికి వచ్చి అన్నదమ్ములు మృతి

- Advertisement -
- Advertisement -

హవేళిఘనపూర్ : చనిపోయినవారి అస్తికలను కలిపే సమయంలో ప్రమాదవశాత్తూ నీటమునిగి అన్నదమ్ములు మృతిచెందిన సంఘటన మెదక్- కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇనాం తండాకు చెందిన అన్నదమ్ములు చౌహన్ హరిసింగ్ (50), బాల్‌సింగ్(42)లు వారి పెద్దనాన్న లచ్చ మరణించగా అస్థికలను శనివారం ఉదయం పోచారం డ్యామ్‌లో కలపడానికి వచ్చారు. ఈ క్రమంలో హరిసింగ్ ప్రాజెక్టులో దిగే క్రమంలో కాలుజారి నీట మునిగాడు.

నీట మునిగిన అన్నను కాపాడే క్రమంలో బాల్‌సింగ్ తమ్ముడు కూడా నీటిలో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న హవేళిఘనపూర్ పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పంచనామా అనంతరం శవ పరీక్ష నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఆనంద్‌గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఇనాం తండాలో కుటుంబ సభ్యులు తండా ప్రజలు తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News