Monday, December 23, 2024

ఢిల్లీలో వీధికుక్కలకు ఇద్దరు అన్నదమ్ముల బలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ వసంత్‌కుంజ్ ఏరియాలో అన్నదమ్ములైన ఇద్దరు చిన్నారులను వీధికుక్కలు బలిగొన్నాయి. 5.7 ఏళ్లు వయసు ఉన్న ఈ చిన్నారులిద్దరూ వేర్వేరు ఘటనల్లో రెండు రోజుల వ్యవధిలో కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న ఏడేళ్ల చిన్నారి జాడ తెలియకుండా పోయింది.

అయితే ఆ తర్వాత జంతువులు పీక్కుతిన్న గాయాలతో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అతని తమ్ముడైన 5 ఏళ్ల చిన్నారి ఆదివారం నాడు ఇదే వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. కాలకృత్యాలు తీర్చుకుంటుండగా బాలుడిపై కుక్కలు విరుచుకుపడ్డాయి. కాసేపటికి బాలుడి బంధువు వచ్చి చూసేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కుక్కల బారిన పడి మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News