- Advertisement -
కుషాయిగూడ ఆర్‌టిసి డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పార్కింగ్ చేసిన రెండు బస్సుల్లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఉద్యోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అయితే, ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది? ప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.
- Advertisement -