Thursday, December 26, 2024

టిటిడికి రెండు బస్సులు విరాళం అందచేసిన చెన్నై విద్యాసంస్థ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి శుక్రవారం ఉదయం రెండు బస్సులు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.

రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం
ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టిటిడికి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరలను విరాళంగా అందించారు. తిరుమల జిఎన్‌సి ప్రాంతంలో గాలి మర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం టిటిడి ఈవో ఎవి. ధర్మారెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు.ఎపిఎస్‌ఈబి అనుమతులు వచ్చిన తర్వాత టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభంచనున్నారు, ఈ విద్యుత్ గాలి మరల ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.దీంతో టిటిడి అవసరాలకు 15 సంవత్సరాల క్రితమే ఈ కంపెనికి 1.3 మెగావాట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రెండు గాలిమరలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఇదే కంపెనీ ప్రతినిధులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా వీరేచూడనున్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, సిఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ 2 జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News