Monday, December 23, 2024

ఔటర్‌పై రెండు కార్లు ఢీ..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని ఫల్టికొటి ఎదురుగా వస్తున్న మరొక కారుపై పడడంతో కారు నుజ్జు నుజ్జు అయి కారులో ఉన్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 6 వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం … వనస్థలిపురం, ఎల్‌ఐజి ఫేజ్ 4 ప్రాంతానికి చెందిన గుమ్మడి రెడ్డప్ప రెడ్డి( 50 ) బాచుపల్లిలోని ప్రైవేటు కంపనీలో విధులు

ముగించుకొని ఇన్నోవా హైక్రాస్ కారులో తిరిగి ఇంటికి వెల్తుండగా ఔటర్ ఎగ్జిట్ 6 సమీపంలో ఎక్స్‌యువి 700, టిఎస్ 05 ఎఫ్‌ఎన్ 3332 వాహణం డ్రైవర్ నిర్లక్షంతో అతివేగంగా డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న ఇన్నోవ కారుపై పడింది. దీంతో కారులో ఉన్న రెడ్డప్ప రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఎక్స్‌యువి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గాయాలు అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నవీన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News