Monday, December 23, 2024

పిడుగుపాటుతో పాడి పశువులు మృతి

- Advertisement -
- Advertisement -

గంభీరావుపేట: మండల కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన వర్షం, పిడుగుపాటుతో అన్నదమ్ములకు చెందిన పాడిగేదె,ఆవు రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి.వివరాలలోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కోటయ్యగారి శ్రీనివాస్ రెడ్డి పాడిగేదె,కోటయ్యగారి రమేష్‌ది ఆవు రెండు పాడి పశువులు పిడుగు పాటుకు మృత్యువాత పడ్డాయి.మండల పశు వైధ్యాధికారి శ్రావన్ మృతి చెందిన పశువులను క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు.

ప్రకృతి రిత్యా పిడుగు పాటుతో 1లక్ష 60వేల విలువ గల పశువులు మృతి చెందాయని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తహసిల్దార్ మధుసుదన్ రెడ్డికి విన్నవించగా వారు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ బాధిత కుటుంబాలకు తనవంతు 5వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News