Sunday, December 22, 2024

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని చైన్లను స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9.9 గ్రాముల విలువైన చైన్, బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, మన్నెగూడకు చెందిన గారాల ప్రసాద్ గౌడ్ అలియాస్ డ్యాన్సర్ ప్రసాద్, బాలాపూర్, సరూర్‌నగర్‌కు చెందిన వద్యావత్ గణేష్‌త డ్యాన్సర్‌గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ గౌడ్, గణేష్ డ్యాన్సర్లు, గణేష్ ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలు చేసేందుకు చైన్‌స్నాచింగ్ చేయాలని ప్రసాద్ గౌడ్ ప్లాన్ వేశాడు. దానికి నిర్మానుష్య ప్రాంతాలు కావాలని చెప్పడంతో గణేష్ చెప్పాడు.

ఈ క్రమంలోనే ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16తేదీన ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా ఇద్దరు నిందితులు బైక్‌పై వెళ్లి ఆమె మెడలోని చైన్‌ను స్నాచింగ్ చేసి పారిపోయారు. బాధితురాలు ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సైలు కవియుద్దిన్, సాయిరాం, పిసిలు శ్రీకాంత్, అభిషేక్, విజయ్‌రాజ్ యాదవ్, గులాం చాంద్‌పాషా తదితరులు పట్టుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News