Monday, December 23, 2024

నగరంలో ఒకే రోజు రెండు చైన్‌స్నాచింగ్‌లు

- Advertisement -
- Advertisement -
పంజాగుట్ట, గోల్కొండ పిఎస్‌ల పరిధిలో ఘటనలు

హైదరాబాద్: నగరంలో మళ్లీ వరుసగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. పశ్చిమ మండల పరిధిలో రెండు చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం…నార్సింగి ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వామి(27) బైక్‌పై మధ్యాహ్నం లంగర్‌హౌస్ వైపు వస్తుండగా తారామతి బారదరి సమీపంలో బైక్ ఆగిపోయింది. స్వామి బైక్‌ను స్టార్ట్ చేసేందుకు కిక్ కొడుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఎం జరిగిందని ప్రశ్నించారు. బైక్ స్టార్ట్ చేసే హడావిడిలో బాధితుడు ఉండగా ఇద్దరు నిందితులు అతడి మెడలోని తులంన్నర బంగారు చైన్‌ను స్నాచింగ్ చేసుకుని పారిపోయారు.

బాధితుడు వెంటనే గొల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట ఎర్రమంజిల్ హిల్‌టాప్ కాలనీకి చెందిన వాస్తవి నీరజా(28)తన అత్త వరరజా కుమారి, ఆడపడుచు సంధ్యతో కలిసి అమీర్‌పేట షాపింగ్ చేసేందుకు బయలు దేరారు. ఓలా కారును బుక్ చేసి కారు కోసం అపార్ట్‌మెంట్ ముందు ముగ్గురు నిల్చున్నారు. గుర్తుతెలియని వ్యక్తి బ్లూ కలర్ పల్సర్ బైక్‌పై వచ్చి నీరజా మెడలోని మూడు తులాల మంగళసూత్రం తెంపుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్ హరిష్‌చంద్రారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News