Saturday, February 1, 2025

రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల మండలం, ఉదండాపూర్‌లో శనివారం విషాదం నెలకొంది. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్యకు రిజర్వాయర్ పక్కన వ్యవసాయ భూమి ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేశ్ (4) శనివారం పొలం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు రిజర్వాయర్ నీటి గుంతలో పడి మృతి చెందారు. వీరిలో మహేశ్ మృతదేహం లభించగా, భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News