Monday, December 23, 2024

పండగ పూట నిజామాబాద్‌లో విషాదం

- Advertisement -
- Advertisement -

బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్ పేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. మృతులను శరణ్(4), నాస్తిక్(5)గా గుర్తించారు. వీడీసీ భవనం నిర్మాణం కోసం త్విన గుంతలోకి వరద నీరు చేరింది. ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సచాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఇత్వార్ పేటలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News