Monday, December 23, 2024

ఫిల్టర్ ఇసుక గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్  : ఫిల్టర్ ఇసుక గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ రూరల్ మండలం హనుమంత తండాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలో చింతపల్లి గ్రామ పరిధిలోని హనుమాన్ తండాలో పాఠశాలలకు సెలవు కావడంతో గ్రామంలోని చిన్నారులు శివ (9) కడవత్ గణేష్ (9) సమీపంలో ఉన్న ఫిల్టర్ గుంతలో నీళ్లు ఉండడంతో ఈతకు వెళ్లారు. గుంత లోతుగా ఉండడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఫిల్టర్స్ కారణంగానే తమ చిన్నారులు మృతి చెందారని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News