- Advertisement -
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రంజాన్ వేళ విషాదం చోటుచేసుకుంది. హిందూశ్మశానవాటికలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. మూడ్రోజుల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు అబ్దుల్ అజీజ్(11), ముల్తాని బాబు(16)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -