Sunday, December 22, 2024

కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

నాచారం: కుక్క కాటుకు పసి పిల్లలు బలైతున్నా కూడా అధికారుల్లో మాత్రం చలనం లేదు.నాచారం డివిజన్ లోని భక్త సమాజ్ వద్ద నివాసముంటున్న చంద్రశేఖర్ వర్షల కు ఇద్దరు కుమారులు ఒక బాబు రూవిన్ (6),రెండవ బాబు తన్విక్ (4),శుక్రవారం రోజున సాయంత్ర ఆరుబయట ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా ఇద్దరి పైకి ఎగబడ్డాయి.ఇద్దరికి గాయపరిచాయి.ఇది గమనించిన చిన్నారుల అక్క యోగిత దైర్యంగా కుక్కలను తరిమి తన తమ్ముళ్లను కాపాడుకున్నది.స్ధానికులు ,కుటుంబీకులు కుక్కలను చెదరగోట్టి పిల్లలను దగ్గర తీసుకోని ఆశ్చర్యపోయారు.కుక్కల దాడిలో తమ పిల్లల రక్తాన్ని చూసి బోరున విలపించారు.

వెంటనే కుక్కల దాడిలో గాయపడిన పిల్లలను హస్పిటల్ కు తీసుకోని వెళ్లి చికిత్స చేయించుకున్నట్టు తెలిపారు.కుక్కల దాడిలో గాయపడిన విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న నాధుడు ఒక్కడు లేకపాయే అని మండిపడ్డారు.గత కోన్ని నెలల నుండి కుక్కల విషయం లో ఇబ్బందులు తలేత్తుతున్నాయని,నడుచుకుంటు వెళ్లిన వారిని కూడా కరుస్తున్నాయని చెప్పిన కూడా అధికారులు నిమ్మకునీరెత్తని విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.కుక్కల వలన పసి పిల్లలు ప్రాణాలు కోల్పోయినకా అధికారులు చేసే హడాహుడి ప్రమాదాలు జరగకముందు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలా సంతోషమని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

కుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన కార్పొరేటర్ ;కుక్కల దాడిలో గాయపడిన చిన్నారులను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పరామర్శించారు.విషయం తెలుసుకున్న కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ భాదితుల ఇంటికి చేరుకోని వారితో మాట్లాడి ప్రమాదం కోసం అడిగి తెలుసుకున్నారు.వెంటనే అధికారులకు ఫోన్ ద్వారా విషయం పై చర్యలు తీసుకోవాలి అని మండిపడ్డారు.స్ధానికంగా కుక్కల సమస్యలు ఉంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండి 040 –21111111,లేదా 100 సమాచారం అందించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ,స్దానికులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News