- Advertisement -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చంద్ర శేఖర్ రెడ్డి(44) హబ్సిగూడాలోని రవీంద్ర నగర్ లో నివాసం ఉంటున్నాడు.అతనికి భార్య కవిత (35) ,కూతురు శ్రీతా రెడ్డి(13),కుమారుడు విశ్వంత్ రెడ్డి (10). చంద్రశేఖర్ రెడ్డి ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి పిల్లలకు విషాన్ని ఇచ్చి వారు చనిపోయిన తరువాత బార్యా భర్తలు ఊరి వేసుకొని ఆత్మహత్యా చేసుకున్నారు.విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేసుకొని విచారిస్తున్నారు.ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులే అయి ఉంటాయని పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -