Wednesday, January 22, 2025

ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే…కందగట్ల అనిల్, దేవి దంపతుల పిల్లలు రోహిత (3), జశ్విత (1) పాలు తాగి ప్రాణాలు విడిచారు. అయితే, చిన్నారులు మృతి చెందిన తరువాత తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ సంఘటన చూసిన గ్రామస్థులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ డిఎస్‌పి తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. పిల్లల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News