Sunday, December 22, 2024

పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… రెండు కోచ్‌లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలో పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం అగ్నిప్రమాదం వల్ల రెండుకోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ లోని సోనీకి ఈ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆగ్రా ధోల్పూర్ మధ్య భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో జనరల్ కోచ్‌లో మంటలు రాజుకుని ఇతర కోచ్‌లకు వ్యాపించాయి. లోకోపైలట్లు గమనించి కాలుతున్న కోచ్‌లను వేరు చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News