Thursday, January 2, 2025

ఖాకీల ఆత్మహత్యల కలకలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/సిద్దిపేట అర్బన్/కొల్చా రం: ఖా కీల వరుస ఆత్మహత్యలు రాష్ట్ర పోలీస్ శాఖను కలవరపాటుకు గురిచేశాయి. అందునా ఒక్క డిసెంబర్ నెలలోనే ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కాగా, మృతుల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఉండటం ఆం దోళన కలిగిస్తోన్న పరిణామం. కారణాలు ఏవైనా నెల రోజుల్లోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీ స్ శాఖ ఆయా కేసుల దర్యాప్తుతోపాటు శాఖాపరమైన విచారణను అంతర్గంతంగా నిర్వహిస్తోంది. ఆదివారం 29) ఒక్కరోజే  ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకరు స్టేషన్ ఆవరణలోనే ఉరివేసుకోగా, మరొకరు ఇంట్లో భార్య పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఇద్దరే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహి స్తున్న హెడ్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు ఆదివారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించాడు.కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయి కుమార్ శనివారం రాత్రి స్టేషన్ ముందున్న ఎస్‌ఐ క్వార్టర్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గుంటూరు జిల్లాకు చెందిన సాయికుమార్‌కు సంగారెడ్డి జిల్లా జోగిపేట కు చెందిన లక్ష్మితో వివాహం జరగడంతో జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేస్తూ నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ మహిళ భర్త సాయి కుమార్‌ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో ఇటీవల గొడవలు జరిగాయని ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పాండారి బాలకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. బాలకృష్ణ ముందుగా పురుగుల మందు తాగి తర్వాత ఉరి వేసుకోవడంతో మృతి చెందాడు. ప్రస్తుతం భార్య, పిల్లలు విషమ పరిస్థితుల్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎఆర్ కానిస్టేబుల్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడి కాలేదు.

సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య
కాగా, డిసెంబర్ 2వ తారీకు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఎస్‌ఐ హరీష్ కొద్ది రోజుల క్రితమే వాజేడు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 14న వరంగల్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇరుకుటుంబాలు ఈ పనుల్లో నిమగ్నమై పెళ్లి దుస్తుల షాపింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ విషాధ వార్త వారిని కుప్పకూల్చింది. అయితే ఎస్‌ఐ హరీష్‌కు సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై రిలేషన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే సదరు యువతితో రిసార్ట్‌కు వెళ్లిన ఎస్‌ఐతో ఆమె పెళ్లి విషయంలో గొడవకు దిగింది. అయితే ఆమె వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని తెలుసుకున్న ఎస్‌ఐ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఉన్నతాధికా రులకు చెబుతా అంటూ సదరు యువతి బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఎస్‌ఐ, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య
డిసెంబర్ 26.. అర్థరాత్రి కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ఎస్‌ఐ సాయికుమార్, బిబిపేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ శృతి, బిబిపేట్‌లో పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ధ్రువీకరించారు. ముగ్గురు కూడా ఎస్‌ఐ కారులో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వీరి ఆత్మహత్యకు ట్రైయాంగిల్ ప్రేమే కారణమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News