- Advertisement -
కేసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులను నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ వీరన్న, సాంబయ్యలను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల లారీ డ్రైవర్‌పై కానిస్టేబుళ్లు దాడి చేసిన సంఘటన తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దానితో పాటు పాసింగ్ వచ్చే లారీల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం పరిధిలో అందరూ సమానమని చట్టాని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. ఇలాంటి వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో అలజడి సృష్టించవద్దని ప్రజలను కోరారు.
- Advertisement -