భోపాల్: మాస్క్ సరిగా ధరించలేదని ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు చితకొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలో మంగళవారం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆసుపత్రిలో కలవడానికి వెళుతుండగా కృష్ణ కేయర్ అనే 35 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ మాస్క్ కిందకు జారిపోయింది. ఇది గమనించిన ఇద్దరు పోలీసులు అతన్ని రోడ్డుపై పట్టుకుని పోలీస్ స్టేషన్ కు రావాలని డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో, వారు అతనిని తీవ్రంగా కొట్టారు. పగటిపూట రహదారి మధ్యలో ఇంత జరుగుతున్న అందరూ ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు కానీ అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత 24 గంటల్లో 3,722 తాజా కేసులు, 18 మరణాలు సంభవించాయి. మార్చి నుండి, మాస్కులు ధరించనందుకు 1,61,000 మందికి జరిమానా విధించబడింది. వారి నుండి రూ. 1.85 కోట్లు వసూలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
Policemen in Indore brutally beating a man for not wearing a mask (which he should) while his child cries, pleading infront of the cops. @ChouhanShivraj will your shameless policemen do the same to PM Modi or BJP leaders who say "no need to wear mask"?
pic.twitter.com/8Ilo7HmLzg— Gaurav Pandhi (@GauravPandhi) April 6, 2021
Two cops brutally beating man in Madhya Pradesh