Sunday, January 19, 2025

బెంగాల్‌లో ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్య!

- Advertisement -
- Advertisement -

Two Councillors of WB murdered
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఒకే రోజు ఇద్దరు కౌన్సిలర్లు హత్యకు గురయ్యారు. వీరిలో ఒకరిని దుండగుడు పాయింట్ బ్లాంక్‌లో(అతి సమీపం నుంచి) కాల్చి చంపినట్లు సిసిటివిలో రికార్డు అయ్యింది. ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతి మున్సిపాలిటీకి చెందిన టిఎంసి కౌన్సిలర్ అనుపమ్ దత్తా ఆదివారం హత్యకు గురయ్యారు. కాగా ఆదివారం సాయంత్రం అగర్‌పరా ప్రాంతంలో అనుపమ్ దత్తా ఓ దుకాణం నుంచి బయటకు వచ్చి స్కూటీపై వెనుక కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు అతడి తలకు తుపాకీ పెట్టి కాల్చి పరారయ్యాడు. అనుపమ్‌ను ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు కాంట్రాక్ట్ కిల్లర్ అని తెలుస్తోంది. దీనికి కొద్ది గంటల ముందే పురులియా ప్రాంతంర్ల కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కుందును గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తపన్ కుందు తన ఇంటికి సమీపంలో వాకింగ్ చేస్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తపన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రెండు హత్యలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News