Wednesday, January 22, 2025

షాకింగ్ వీడియో: స్కూలుకు వెళ్తున్న పాపపై ఆవు దాడి.. కొమ్ములతో గాలిలోకి..

- Advertisement -
- Advertisement -

అరుంబాక్కమ్‌: చెన్నైలోని అరుంబాక్కమ్‌లోని ఎంఎండీఏ కాలనీలో స్కూలుకు వెళ్తున్న ఏడేళ్ల చిన్నారి పై ఆవు ఒక్కసారిగా విరుచుకుపడింది. బెంబేలెత్తిపోయిన తల్లి నిస్సహాయ స్థితిలో ఎం చెయ్యాలో అర్ధంకాక కాపాడే ప్రయత్నం చేసింది. ఆవు దాడిలో బాలిక తీవ్ర గాయాలపాలైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. చిన్నారి తన సోదరుడు, తల్లితో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ముగ్గురూ ఒక ఎద్దు, ఆవును దాటి నడుచుకుంటూ వెళుతుండగా, బాలుడు జంతువులను దూషించగా, అకస్మాత్తుగా ఎద్దు తిరిగి ఆ అమ్మాయిని తన కొమ్ములతో గాలిలోకి ఎగరేసింది. తల్లి అరుపులు విన్న స్థానికులు ఎద్దుపై రాళ్లు రువ్వి బాలికను రక్షించేందుకు పరుగెత్తారు. అయితే ఎద్దు దాడిని కొనసాగించడంతో అది ప్రభావం చూపలేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాళ్లు రువ్వడం ద్వారా ఎద్దు ఎట్టకేలకు ఆగిపోయింది.

ఆ అమ్మాయి ఒక నిముషానికి పైగా ఎద్దు చేత నరకయాతన పడింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతోంది. ఈ ప్రాంతంలో అనేక విచ్చలవిడి ఎద్దులు స్వైరవిహారం చేయడంతో ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News