Wednesday, January 22, 2025

2 కోట్ల విలువైన చీరలు స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

నిజాంపేట్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కట్టలు కట్టలు నగదు, మద్యంతో పాటు ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన వస్తువులు పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రెండు చీరల లోడ్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలోని బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్మెంట్‌పై పోలీసులు దాడి చేశారు. 743 బ్యాగ్ లలో ఉన్న రూ.2 కోట్లకు పైగా విలువ చేసే చీరలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చీరల విలువ రూ. 2,25,98,590/- (రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంబై ఎనిమిది వేల 5 వందల తొంబై రూపాయలు) అని సమాచారం. ప్రగతినగర్ లోని అపార్ట్మెంట్ లో ఓ డబుల్ బెడ్ రూమ్ లో 2లారీల లోడ్ చీరలను డంప్ చేస్తున్న సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు లారీలను సీజ్ చేశారు. సంచులలో చీరలు ఉన్నాయని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

వరంగల్ ప్రాంతంలోని కాశంపుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుంచి తాను చీరలు కొన్నానని వీటి యజమాని పోలీసులకు వెల్లడించాడు. అయితే రిసీప్ట్ లాంటివి చూపించాలని, చీరల ఖరీదుకు సంబంధించి ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనకు సూచించారు. బాచుపల్లి పోలీసులు చీరలతో ఉన్న రెండు లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎన్నికల సమయం కావడంతో ఓటర్లకు చీరలు పంచి ప్రలోభపెట్టాలని చూస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు నిఘా పెట్టారు. నేతలు ఓటర్లకు డబ్బుల పంపిణీ, ఇతర ప్రలోభాలపై పోలీసులు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టగా భారీగా నగదు, బంగారు, వెండి, లిక్కర్ దొరుకుతోంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

వారం వ్యవధిలో రూ.100 కోట్లు స్వాధీనం
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారంలో రోజుల్లో లెక్కల్లోకి రాని నగదు, ఇతర సొత్తు భారీగానే పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నలువైపుల మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా సొత్తు లభిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 101,18,17, 299 రూపాయలను పట్టుకున్నారు. వారం రోజుల్లో పట్టుకున్న సొత్తు గత ఎన్నికల్లో మొత్తంగా పట్టుకున్న దానికి సమానం. గతం ఎన్నికల్లో పోలింగ్ జరిగే వరకు పట్టుకున్న సొత్తు 103కోట్ల 89 లక్షల 22 వేల 753 రూపాయలుగా చెప్పారు. ఇందులో కేవలం నగదు 97 కోట్ల 33 లక్షల 61 వేల 72 రూపాయలు. ఇప్పుడు పట్టుకున్న 101 కోట్లలో లెక్కలు చూపని నగదే 55 కోట్ల 99 లక్షల, 26వేల 994 రూపాయలుగా అధికారులు చెబుతున్నారు. మరింత నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News