Wednesday, January 22, 2025

డఫాబెట్ వెబ్ సైట్ ద్వారా మోసాలు.. ఢిల్లీలో అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 1.04 కోట్ల నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడులు, ఆన్ లైన్ గేముల పేరుతో నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులను చేధించిందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. డఫాబెట్ వెబ్ సైట్ ద్వారా నిందితులు మోసాలు చేస్తున్నారన్నారు. డఫాబెట్ లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని మోసం చేస్తున్నారని వెల్లడించారు. ఓ వ్యక్తి డఫాబెట్ లో రూ.70 లక్షలు పెట్టి ఆన్ లైన్ గేమ్ ఆడారన్న సిపి రూ. 70 లక్షలు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారని చెప్పారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. హరియాణాకు చెందిన హితేశ్ గోయల్ మోసాలు చేస్తున్న నిందితుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశామని హైదరాబాద్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News