Monday, December 23, 2024

ఆన్‌లైన్‌లో మోసగాళ్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పెట్టుబడుల పేరుతో పలు మోసాలు చేస్తున్న నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కోటికిపై నగదు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ చెక్‌బుక్‌లు, 52డెబిట్ కార్డులు, మూడు హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి టిఎస్‌ఐసిసిసిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన హితేష్ గోయల్ ఢిల్లీలో ఆఫీస్ ఏర్పాటు చేసి నేరాలు చేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్ www.dafabet.com ద్వారా పెట్టుబడులు పెట్టమని చెప్పి మోసాలు చేస్తున్నా. హితేష్ అతడి స్నేహితుడు సంజీవ్ దుబాయ్‌లో ఉంటూ నేరాలు చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌ను ఫిలిప్పిన్స్, దుబాయ్, హాంకాంగ్, చైనా కేంద్రంగా నడిపిస్తూ మోసాలు చేస్తున్నారు.

నగరంలోని సోమాజిగూడకు చెందిన బాధితురాలు నిందితులు చెప్పినట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ.70లక్షలు పంపించింది. తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు తక్కువ పెట్టుబడితో అధిక వడ్డీ వస్తుందని చెప్పడంతో పెట్టుబడి పెట్టి మోసపోయింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. దుబాయ్‌లో ఉంటూ రోనాక్ తన్నా యూనిటీ స్టాక్స్ కంపెనీలో పెట్టుబడిపెడితే ఆరు నెలల్లో 30శాతం లాభాలు వస్తాయని చెప్పాడు. నిందితుడు జుడిత్ గోన్‌సాల్వే, సనామహ్మద్ కురేషి మిగతా వారితో కలిసి నేరాలు చేస్తున్నాడు. వీరి మాటలు నమ్మిన బాధితురాలు రూ.3,16,34,764 పెట్టుబడి పెట్టింది. పెట్టుబడిపెట్టిన సమయం ముగిసినా కూడా లాభాలు ఇవ్వకుండా సాకులు చెబుతుండడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసింది.

బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన వారికి కమీషన్ ఇచ్చేవారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ గంగాధర్, పిసిలు ఉమా, సునీల్‌కుమార్, సుదర్శన్, నరేష్, అశోక్‌కుమార్, సాయినాథ్ కలిసి పట్టుకున్నారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితుడు 95 బ్యాంకు ఖాతాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News