- Advertisement -
చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి ఉల్లంపల్లి గ్రామాల్లో బుధవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షంలో పడిన పిడుగుపాటుకు రెండు పాడి ఆవులు మృతి చెందాయి. సుందరగిరి గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు చెందిన ఆవు, ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీంబీ పాడి ఆవు పిడుగుపాటుకు మృతి చెందినట్లు తెలిపారు.
ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగ ఆవులు మృత్యువాత పడడంతో, చనిపోయిన ఆవులను చూసి రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కొ ఆవు విలువ సుమారు 80వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. రైతును కరీంనగర్ డెయిరీ సుందరగిరి పాలకేంద్ర అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ పరామర్శించారు. పాడి రైతు తాళ్లపల్లి శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.
- Advertisement -