Thursday, January 23, 2025

దళిత బాలికలను చెట్టుకు ఉరేసి…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇద్దరు దళిత బాలికలను చెట్టుకు ఉరేసి చంపిన ఆరోపణలు వస్తున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖ్మిపూర్ ఖేరీ జిల్లా నిఘాసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాల్‌పూర్ మజ్రా తామోలీ పుర్వా గ్రామ శివారులో ఇద్దరు దళిత బాలికలు చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్థులు, బాలికల కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు తన కూతుళ్లను ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేవని పేర్కొన్నారు. లఖ్మిపూర్ ఖేరీ ఎస్‌పి సంజీవ్ సుమన్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News