- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ 31 బస్ స్టాప్ లో గురువారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల పసికందు పాపాయిని ఓ కసాయి తల్లి ఆటో డిక్కీ లో వదిలేసి వెళ్లిపోయింది. సులబ్ కాంప్లెక్స్ కు వెళ్లి వచ్చిన ఆటో డ్రైవర్ పసికందును గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బస్టాప్ లో ఆటోను నిలిపి ఆటో డ్రైవర్ మూత్ర విసర్జనకు వెళ్ళాడు. ఆ పసికందు భారం అనుకుందో ఏమో కాని ఆ తల్లి ఆటో వెనుక సీటు ప్రక్కన ఉండే ఖాళీ స్థలంలో పాపాయిని పడుకో బెట్టి వెళ్ళిపోయింది. ఆటో డ్రైవర్ వచ్చి చూడగా పాపాయి ఏడుస్తుండడంతో స్థానిక మోండా మార్కట్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పాపను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిసి కెమెరాల ఆధారంగా తల్లిని గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -