Monday, January 20, 2025

రెండ్రోజులు భారీ వర్షాలే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం గురువారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, ఆదిలాబాద్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈదురు గాలులు, ఉరుములతో ….
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపుర్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, బషీర్ బాగ్, లక్డీకాపుల్, బహదూర్‌పురా, చార్మినార్, బార్కస్, ఫలక్‌నుమా, చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, చింతల్, సుచిత్ర, సూరారం, నిజాంపేట, షేక్‌పేట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News