- Advertisement -
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి జార్ఖండ్ నుంచి చత్తిస్‌గఢ్ విదర్భల మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్రవరకూ సగటు సముద్ర మట్టానికి 3.1కి.మి ఎత్తువద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండురోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వ ర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Advertisement -